చర్లపల్లి-కామాఖ్య మధ్య అమృత్ భారత్ రైలు..మార్చి 13 నుంచి ప్రారంభం

చర్లపల్లి-కామాఖ్య మధ్య అమృత్ భారత్ రైలు..మార్చి 13 నుంచి ప్రారంభం

హైదరాబాద్​సిటీ,వెలుగు:   దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య–చర్లపల్లి  మధ్య సరికొత్త అమృత్ భారత్ ఎక్స్‌‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఈనెల 13వ తేదీ నుంచి అందబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ రైలులో పూర్తిగా స్లీపర్, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్‌‌లు అందుబాటులో ఉంటాయి. 

ఈ రైలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లను ఈశాన్య రాష్ట్రాల సింహద్వారంగా పిలిచే అసోంతో నేరుగా అనుసంధానిస్తుంది. కామాఖ్య దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ రైలు ఎంతో వెసులుబాటుగా మారనుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఇరు వైపులా ఆగుతుందన్నారు.