మంత్రి వివేక్ ను కలిసిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు

మంత్రి వివేక్ ను  కలిసిన సింగరేణి  ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో సెక్యూరిటీ కాంట్రాక్ట్​ కొత్త టెండర్ ​అమలులోకి తీసుకవచ్చి తమకు ఉపాధి  కొనసాగేలా కృషి చేయాలంటూ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మంగళవారం మంత్రి వివేక్​వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. 

పాత టెండర్​ ద్వారా గత పదేండ్లుగా 213 మంది విధులు నిర్వహిస్తున్నామని మంత్రికి తెలిపారు. అనంతరం మందమర్రిలో నూతన వధూవరులు కాంగ్రెస్ లీడర్ చిప్పకుర్తి శశిధర్, ​-సౌమ్యను  మంత్రి ఆశీర్వదించారు. అనంతరం దీపక్ నగర్​కు చెందిన కాంగ్రెస్ లీడర్, స్కూల్​యాజమాని​పోలు శ్రీనివాస్ తండ్రి పోశం అనారోగ్యంతో, పాలచెట్టు ఏరియాకు చెందిన మల్లేశ్వరి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలను మంత్రి  పరామర్శించారు.