సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జికి మంత్రి వివేక్ పరామర్శ

సిద్దిపేట కాంగ్రెస్  ఇన్‌‌‌‌‌‌‌‌చార్జికి మంత్రి వివేక్ పరామర్శ


సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పూజల హరికృష్ణను మైనింగ్‌‌‌‌‌‌‌‌, కార్మిక శాఖ, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు.  ఇటీవల హరికృష్ణ అనారోగ్యానికి గురై  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌.. సిద్దిపేటలో హరికృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మ్మద్, ఎల్లం యాదవ్, గోపికృష్ణ, రాజబహదూర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, డీసీసీ మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి పాల్గొన్నారు.