నీరా కేఫ్ లీజుకు టెండర్ల ఆహ్వానం

నీరా కేఫ్ లీజుకు టెండర్ల ఆహ్వానం

వికారాబాద్, వెలుగు:  నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ భవనాన్ని (నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంక్వెట్ హాల్, 7 వాణిజ్య దుకాణాలు) లీజుకు ఇచ్చేందుకు తెలంగాణ టాడీ ట్యాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది.

2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఎక్సైజ్ శాఖలో నమోదై క్రియాశీలంగా ఉన్న గౌడ వృత్తి సంఘాలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు.  ఆసక్తి గల సంఘాలు ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్​లైన్ ద్వారా బిడ్లు దాఖలు చేయాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు www.tgttcfc.com వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని వివరించారు.