- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్‌కు చెందిన కాంగ్రెస్ నేత నారెడ్డి మోహన్‌రెడ్డి జడ్పీటీసీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
మంగళవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీని కలిసి కామారెడ్డికి తిరిగి వస్తుండగా మెదక్ జిల్లా మాసాయిపేట్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీటులో కూర్చున్న మోహన్‌రెడ్డి స్పాట్లో మృతిచెందారు. కారులో ఉన్న మద్దికుంటకు చెందిన ఓ దినపత్రిక విలేకరి తిరుపతి రెడ్డి, అన్నారం గ్రామానికి చెందిన రఘోత్తమరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
