వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు.. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు

వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు.. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మిగతా పార్టీలకు ప్రజలు ఈవీఎంలాగా కనిపిస్తారని మండిపడ్డారు. తెలంగాణలో గులాబీ విప్లవం వచ్చిందని చెప్పారు. తెలంగాణ పాలనను దేశం అంతా అందిస్తామని చెప్పారు. 

వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు ..రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాహుల్ గాంధీ కుటుంబమే పాలించిందని గుర్తు చేశారు. రాహుల్ ముత్తాత, నాన్నమ్మ, తండ్రి పాలించి దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇటు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందని నిలదీశారు. 

కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి..బోధన్ నియోజకవర్గంలో  ఒక్క చెరువును కూడ బాగు చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్లో సీనియారిటీకి సిన్సియారిటీ మధ్యే  పోటీ అని చెప్పారు. తెలంగాణలో లక్ష 30 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు.