కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలి

V6 Velugu Posted on Sep 15, 2021

హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం తక్కువ పన్నులు ఇస్తుందన్న కేటీఆర్.. రాజీనామా లేఖతో చర్చకు రావాలని ఎంపీ అర్వింద్ సవాల్ చేశారు. లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎కి మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‎పై... నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు. కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే కేంద్రం తెలంగాణకు ఎక్కువే ఇస్తోందని అర్వింద్ చెప్పారు. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని.. మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బియ్యం సేకరణ కోసం రాష్ట్రానికి ప్రతి పైసా ఇప్పటి వరకు కేంద్రమే ఇచ్చిందన్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు వెంటనే తెరిపించాలని అర్వింద్  డిమాండ్ చేశారు.

Tagged Bjp, TRS, Bandi Sanjay, Telangana, KTR, Minister Harish rao, MP Dharmapuri Arvind

Latest Videos

Subscribe Now

More News