ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

 ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం (సెప్టెంబర్ 27)  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ ను ఏపీ సీఐడీ చేర్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1 గా ఏపీ సీఐడీ చేర్చింది. అయితే ఇదే కేసులో నారా లోకేష్ ను ఏ 14 గా చేరుస్తూ సీఐడీ అధికారులు కోర్టులో ఈ నెల 26న మెమో దాఖలు చేశారు. ఈ నెల 29వ తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ 14గా సీఐడీ చేర్చింది.దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టైన తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడే ఉన్నారు. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేయడంలో లోకేష్ చక్రం తిప్పారని సీఐడీ ఆరోపణలు చేసింది. తమకు సంబంధించిన వారికి ప్రయోజనం కల్గించేలా ప్రయత్నాలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. లింగమనేని రమేష్ భూములకు ప్రయోజనం కలిగేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ కేసులో తన పేరును చేర్చడంపై లోకేష్ మండిపడ్డారు. 

కానీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. దీంట్లో భాగంగానే తన పాదయాత్ర కొనసాగించేందుకు..మరోపక్క తండ్రి బెయిల్ వంటి వ్యవహారాలు చూసుకోవాలంటే తాను అరెస్ట్ అవ్వకూడదనే ఆలోచనతో లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో A-1గా ఉన్న చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఇటువంటి పరిణామాల మధ్య లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు