పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక అడుగు

పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక అడుగు

నెట్‌ఫ్లిక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా.. తాజాగా భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ప్రకటించింది. ఇంటి సభ్యులు మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయగలరని ఇంతకుమునుపే ప్రకటించగా..  గత సంవత్సరం కఠినమైన పరిస్థితుల తర్వాత కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. యూజర్స్ వారి కుటుంబానికి మించిన వ్యక్తులతో పాస్‌వర్డ్‌లను పంచుకోవడంపై మేలోనే ఓ కీలక ప్రకటనను రిలీజ్ చేసింది.

కొంతకాలంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆదాయం తగ్గుముఖం పట్టడండో డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది Netflix చాలా మంది చందాదారులను కోల్పోయింది. మిగతా ఓటీటీ సంస్థల నుంచి సైతం గణనీమైన పోటీని ఎదుర్కొంటోన్న నెట్ ఫ్లిక్స్.... ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే పాస్ వర్డ్ షేరింగ్ ను కట్టడి చేస్తామని ఆ సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్ ఇప్పటికే ప్రకటించారు. జనవరి నుంచి ఈ అవకాశాన్ని నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపారు.   

పాస్ వర్డ్ షేర్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే

పాస్ వర్డ్ షేర్ చేయాలనుకునే ఇకనుంచి కొంత ఛార్జీ చెల్లించి షేర్ చేసుకోవచ్చని Netflix వెల్లడించింది. అయితే, పాస్ వర్డ్ షేరింగ్ అనేది కుటుంబ సభ్యులు ఉచితంగా చేసుకోవచ్చని, బయటివారు ఉపయోగిస్తేనే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే భారత్ లోనూ పాస్ వర్డ్ షేరింగ్ కు ఛార్జ్ చెల్లించే నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌ వర్డ్స్ షేర్ చేసినందుకు యూజర్లకు ఛార్జీ విధించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఇండియాలో.. ‘Add a home’ ఫీచర్‌‌ను తీసుకురానుంది.