బస్తీ దవాఖానలో ఎక్స్పైరీ మందులు.. విచారణకు ఆదేశించిన హెచ్ఆర్సీ

బస్తీ దవాఖానలో ఎక్స్పైరీ మందులు.. విచారణకు ఆదేశించిన హెచ్ఆర్సీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​రసూల్​పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన పిటిషన్​పై జాతీయ మానవ హక్కుల కమిషన్​మంగళవారం విచారణకు ఆదేశించింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.