మెండోరా మండలంలో ‘భూభారతి’ అర్జీలపై ఫీల్డ్ విజిట్ షురూ

మెండోరా మండలంలో ‘భూభారతి’ అర్జీలపై ఫీల్డ్ విజిట్ షురూ
  • పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ

నిజామాబాద్, వెలుగు : ‘భూభారతి’ కోసం పైలట్  ప్రాజెక్టుగా ఎంపికైన మెండోరా మండలంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిశీలనకు మంగళవారం రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్​ విజిట్ ప్రారంభించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ ఆధ్వర్యంలో బుస్సాపూర్, దూదిగావ్​లో కొనసాగిన విచారణ తీరును కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పరిశీలించారు. రెండు విలేజ్​ల నుంచి వచ్చిన ల్యాండ్​ సంబంధ దరఖాస్తులను జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన డెస్క్​లో క్షుణ్ణంగా స్టడీ చేసి ఏం చేయాలనే అంశాన్ని నిర్ణయిస్తున్నారు.

 అర్జీదారులతో మాట్లాడాక గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవడానికి  వెళ్తున్నారు. ఈ విధానం బాగుందని ఇలాగే ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గవర్నమెంట్ భూభారతి చట్టాన్ని  ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ప్రతి విషయాన్ని  నిశితంగా పరిశీలించి లోపాలకు తావులేకుండా పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్ తదితరులు ఉన్నారు.