టీచింగ్ హాస్పిటల్స్లో పేషెంట్ సేఫ్టీ కమిటీలు మస్ట్.. వైద్య తప్పిదాలతో ఏటా 52 లక్షల మందికి ముప్పు

 టీచింగ్ హాస్పిటల్స్లో  పేషెంట్ సేఫ్టీ కమిటీలు మస్ట్..  వైద్య తప్పిదాలతో ఏటా 52 లక్షల మందికి ముప్పు
  •  ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ ను నియమించాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆదేశాలు
  •  వైద్య తప్పిదాలతో ఏటా 52 లక్షల మందికి ముప్పు 

హైదరాబాద్, వెలుగు: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ లో రోగుల రక్షణ కోసం తప్పనిసరిగా పేషెంట్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్  (ఎన్ఎంసీ) ఆదేశించింది. చికిత్సలో జరిగే పొరపాట్లు, రోగ నిర్ధారణ లోపాలు, హాస్పిటల్స్ లో సోకే ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ల వల్ల దేశంలో ఏటా దాదాపు 52 లక్షల మంది బాధితులుగా మారుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చింది. ఇలాంటి తప్పిదాలను అరికట్టి, రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇందులో భాగంగా ప్రతి మెడికల్ కాలేజీలో ఒక సీనియర్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ను ప్రత్యేకంగా పేషెంట్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్ గా నియమించాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ స్పష్టం చేసింది. కాలేజీ ప్రిన్సిపాల్ లేదా మెడికల్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో నోడల్ ఆఫీసర్, నర్సింగ్ అధికారులతో పాటు 11 కీలక విభాగాల డాక్టర్లు సభ్యులుగా ఉంటారు. 

మందుల వాడకం, సర్జరీలు, రక్త మార్పిడి, పరికరాల నాణ్యత, ల్యాబ్ టెస్టులు, ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ల నియంత్రణ, ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ, ఆయుష్ విభాగాల భద్రతను వీరు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రుల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాచకుండా మూలాలను గుర్తించి సరిదిద్దాలని, ప్రతి నెలా లేదా 3 నెలలకోసారి సమీక్ష జరపాలని ఆదేశించింది. కమిటీ స్వరూపం, నోడల్ ఆఫీసర్ వివరాలను  [email protected] మెయిల్‌‌‌‌‌‌‌‌కు తక్షణమే పంపాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ స్పష్టం చేసింది.