వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మంగళవారం వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్ సాగర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సొసైటీ రూరల్ మార్ట్ ను కలెక్టర్ స్నేహ శబరీశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీసీవో సంజీవరెడ్డి, డీఎం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
