రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలే : రేవంత్ రెడ్డి

 రూ.  27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలే : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలే అని విమర్శించారు. వేల కోట్లు రూపాయలు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లుగా తీసుకున్నారని చెప్పారు. పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కొడంగల్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సింలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనే రైతు రుణమాఫీ కూడా చేపడాతామని తెలిపారు. రైతుభరోసాను పది రో జుల్లో అర్హులందరికి వేస్తామని చెప్పారు. 

 గతంలో మహబూబ్ నగర్ కు వలస వచ్చి ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ ఇక్కడి ప్రాంతానికి అన్యాయం చేశారని చెప్పారు. ఉమ్మడి పాలన కంటే రాష్ట్రం వచ్చాకే ఎక్కువ అన్యాయానికి గురయ్యామని అన్నారు. చిన్నా రెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దూరారని విమర్శించారు. రోజా పెట్టిన రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చి వచ్చారని విమర్శించారు.   బీఆర్ఎస్ ను చీ కొట్టిన సిగ్గురాలేదని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ పాలమూరులో సభ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ హోదా ప్రకటిస్తామని చెప్పి ఎందకు చేయలేదని ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉండి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని అన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ యుద్ధం ముగియలేదని పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చేల కార్యకర్తలు పని చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.