- నమ్ముకున్న కార్యకర్తలను వదులుకోను
- తెలంగాణ కోసం 42 మంది ఎమ్మెల్యేలతో
- వనపర్తిలో అతి పెద్ద మీటింగ్ పెట్టిన చరిత్ర నాది
- నా కుమారుడి కోసం ఏ పదవీ అడగలే
- ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి, వెలుగు : తనకు పదవి లేకున్నా తన గౌరవం తనకుందని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. గోపాల్పేట మండలంలోని తన స్వగ్రామం జయన్న తిరుమలాపూరులో వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయనతనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పదవిలో లేకున్నా తనను నమ్ముకున్న కార్యకర్తలను వదులుకోనని, వారికి అండగా ఉంటానని అన్నారు. తనకు పదవి మీద షోకుంటే తాను కేబినెట్హోదాలో ఉన్నప్పుడే కారు డ్రైవరు, సెక్యూరిటీ అన్నీ రిటర్న్ చేసేవాడిని కాదన్నారు. తన కొడుకుకు ఏ పదవీ అడగలేదన్నారు. 42 మంది ఎమ్మెల్యేలతో వనపర్తిలో అతిపెద్ద మీటింగ్ పెట్టి సంతకాలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది తానేనని గుర్తుచేశారు.
