సౌత్ Vs నార్త్ : టిఫిన్ల గురించి ట్విట్టర్ లో కొట్టుకుంటున్నారు..

సౌత్ Vs నార్త్ : టిఫిన్ల గురించి ట్విట్టర్ లో కొట్టుకుంటున్నారు..

ఆహారానిని ప్రజలను ఒకచోట చేర్చే అద్భుతమైన శక్తి ఉంది. కానీ దీని వల్ల కొన్ని సార్లు ఉద్వేగభరితమైన చర్చలు, విభేదాలను కూడా రేకెత్తిస్తాయి. విభిన్నమైన ఆహార ప్రాధాన్యతలు, అభిరుచులతో సోషల్ మీడియాలో ఏదో ఒక ఫుడ్ ఐటమ్ వైరల్ అవుతూనే ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల పోహా-జలేబి అల్టిమేట్ బ్రేక్‌ఫాస్ట్ ఛాంపియన్ అని ధైర్యంగా పేర్కొన్న ఓ ట్విట్టర్ వినియోగదారుడి పోస్టుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది వెంటనే ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షించింది, అనంతరం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ట్వీట్ కు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇరువురి మధ్య చర్చను లేవనెత్తింది. 4మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిన ఈ పోస్టుకు.. వారపు రోజులలో పోహా - వారాంతాల్లో దోస అని ఒకరు కామెంట్ చేయగా.. పోహా-జలేబి ఒక రుచికరమైన అల్పాహారం.. కానీ దక్షిణ భారత బ్రేక్‌ఫాస్ట్‌లను భర్తీ చేయలేము అని ఇంకొకరు రిప్లై ఇచ్చారు. దక్షిణ భారత అల్పాహారం ఉత్తమమైనది.. ఓ మహారాష్ట్రీయుడిగా తాను వారానికి ఒకసారి కంటే ఎక్కువ పోహా తీసుకోను అంటూ మరొకరు రాసుకొచ్చారు.

ఇక ఈ పోస్టుకు విభేదించిన కొందరిలో ఒడిశా అల్పాహారం ఉత్తమమైనది అని రాయగా.. పంజాబీ పరాఠా, వారణాసి కచోరీలను కూడా దీనికి జోడించండి అంటూ ఒకరు సలహా ఇచ్చారు. ఇడ్లీ, వడ, సాంబార్, పొంగల్, దోసె, చట్నీల కంటే చాలా ఆరోగ్యకరమైనది అని మరొక యూజర్ తెలిపారు. పోహా నా శక్తి రహస్యం అని ఇంకొక ట్విట్టర్ యూజర్ సరదాగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టుతో పాటు దీనికి వచ్చిన కామెంట్లు కూడా వైరల్ గా మారాయి.

https://twitter.com/GabbbarSingh/status/1666350131162271744