ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.రూ. 15.5 లక్షల విలువైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు.పేలుడు పదార్థాలను నిల్వచేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేలుడు పదార్థాలకు అనుమతి లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
