పేదరిక నిర్మూలనకు  చదువే ఆయుధం: మంత్రి పొన్నం ప్రభాకర్

పేదరిక నిర్మూలనకు  చదువే ఆయుధం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్/ జగిత్యాల, వెలుగు: సమాజంలో పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటైన సర్వేల్ వంటి గురుకులాల్లో చదివిన ఎందరో నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు ఆదివారం ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ బి.సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 326 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనీసం 10 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. 

బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ పనులకు శంకుస్థాపన.. 

ధర్మపురి బస్​స్టేషన్​ను రూ. 2.57 కోట్లతో ఆధునీకరించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిందని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దాదాపు రూ. 13 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతకుముందు మంత్రులు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.