మలేరియాకు పవర్​ఫుల్ వ్యాక్సిన్

మలేరియాకు పవర్​ఫుల్ వ్యాక్సిన్
  • మలేరియాకు పవర్​ఫుల్ వ్యాక్సిన్
  • ‘ఆర్21/మ్యాట్రిక్స్ ఎం’ టీకా వినియోగానికి ఘనా ఆమోదం   
  • వ్యాక్సిన్ ఎఫికసీ 75 శాతంపైనే  
  • డెవలప్ చేసిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ..
  • తయారు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్ 
  • ‘వరల్డ్ చేంజర్’ టీకా అంటున్న ఎక్స్ పర్ట్ లు  

న్యూఢిల్లీ: మలేరియా నివారణకు మరో పవర్​ఫుల్ వ్యాక్సిన్​అందుబాటులోకి వచ్చింది. ‘ఆర్21/మాట్రిక్స్​ఎం’ అని పేరు పెట్టిన ఈ వ్యాక్సిన్​వినియోగానికి ప్రంపచంలోనే తొలిసారిగా ఘనా దేశం ఆమోదం తెలిపింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ టీకాను పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) 75 శాతం ఎఫికసీ ఉండాలని టార్గెట్ పెట్టగా.. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ లో 77 శాతం ఎఫికసీని చాటింది. దీంతో ఇది మలేరియా నివారణలో ‘వరల్డ్ చేంజర్’ వ్యాక్సిన్ గా నిలుస్తుందని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు.

ముందుగా ఐదు నెలల నుంచి మూడేండ్ల మధ్య వయస్సున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్​ వేయాలని ఘనా ప్రభుత్వం నిర్ణయించింది. మలేరియాతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఘనా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నుంచి గ్రీన్​సిగ్నల్ లభించింది. ఫస్ట్ ఫేజ్ మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఘనా, ఆఫ్రికన్​దేశాలకు ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క ఘనా దేశంలోనే ఏడాదికి మలేరియా కారణంగా 20వేల మంది చనిపోతున్నారు. వీరిలో 25 శాతం మంది ఐదేండ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. 

77 శాతం ఎఫికసీ.. 

ఆక్స్​ఫర్డ్​లో 30 ఏండ్లుగా మలేరియా వ్యాక్సిన్​పై రీసెర్చ్ కొనసాగుతున్నదని, అత్యధిక సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్ తయారు చేయడంలో సక్సెస్ అయ్యామని ‘ఆర్21/మాట్రిక్స్​ఎం’ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్, జెన్నర్ ఇన్​స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ ప్రకటించారు. వ్యాక్సిన్ అవసరమైన దేశాలకు సప్లై చేయొచ్చన్నారు. ట్రయల్స్​కు సంబంధించిన కీలక విషయాలను ‘ది లాన్సెట్’ జర్నల్​లో ప్రింట్ చేశారు. 12 నెలల ఫాలో అప్​లో వ్యాక్సిన్ 77 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వ్యాక్సిన్​కు సంబంధించి ఎలాంటి ప్రతికూల సంఘటనలు చోటు చేసుకోలేదని పరిశోధకులు తెలిపారు. అత్యధికంగా 77 శాతం, తక్కువలో తక్కువగా 71శాతం సామర్థ్యంతో పని చేసిందని వివరించారు. కొన్ని దశాబ్దాల్లో 100కు పైగా మలేరియా వ్యాక్సిన్​లు క్లినికల్ ట్రయల్స్​లో ఎంటర్ అయ్యాయని ప్రచురించారు.

అయితే, ఎవరూ డబ్ల్యూహెచ్​వో పెట్టిన 75 శాతం సామర్థ్యానికి రీచ్ కాలేదని వివరించారు. ఆర్ 21 వ్యాక్సిన్‌‌ను బయోటెక్నాలజీ దిగ్గజం సీరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నది. ఏటా 200 మిలియన్ల కంటే ఎక్కువ డోసులను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మలేరియాపై పోరాటంలో భాగంగా ఘనా అధికారులు వ్యాక్సిన్​కు లైసెన్స్ ఇవ్వడం ఎంతో కీలకమని సీరమ్ ఇన్​స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా అన్నారు.