వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు.
డొనాల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడుతూ, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి పెరగడం, ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నప్పటికీ ఆయన ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా మెక్సికోలో అమెరికా దాడులు చేయడానికి అంగీకరించినట్లు అని కూడా చెప్పారు. వెనిజులా, మెక్సికో సహా ఇతర పక్క దేశాల నుండి సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను అణచివేయాలనే లక్ష్యంతో ట్రంప్ కరేబియన్‌లో అమెరికన్ దళాల మోహరింపును పెంచారు.
ఓవల్ ఆఫీస్‌లో విలేకరులు మదురోతో చర్చలు జరపాలనుకుంటున్నారా అని ట్రంప్ ని అడిగినప్పుడు "ఒక సరైన సమయంలో నేను అతనితో మాట్లాడతాను" అని సమాధానం ఇచ్చారు. మరోవైపు మెక్సికోలో అమెరికా దాడులను ఆమోదిస్తారా అని అడిగినప్పుడు ట్రంప్ "నాకు సరేనదే అనిపిస్తుందని... డ్రగ్స్‌ను ఆపడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. అది ప్రాణాలను కాపాడుతుందని, నేను అలా చేయడానికి గర్వపడతాను" అని అన్నారు.
తరువాత ఓ వీకెండ్ టీవీ షోలో మదురో మాట్లాడుతూ వెనిజులాతో మాట్లాడాలనుకునే అమెరికాలోని ఎవరితోనైనా ముఖాముఖి చర్చలు జరపడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. అమెరికా విస్తరించిన సైనిక ఉనికి ద్వారా పాలన మార్పును బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని వెనిజులా ఆరోపించింది. ఇందులో ఇప్పుడు విమాన వాహక నౌకల సమూహం, అనేక యుద్ధనౌకలు, స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి.
దీనికి వ్యతిరేకంగా వాషింగ్టన్, మదురో ఒక ఉగ్రవాద మాదకద్రవ్యాల ముఠాను నడుపుతున్నాడని ఆరోపించింది, దీన్ని మదురో గట్టిగా తిరస్కరించారు. సెప్టెంబర్ నుండి అంతర్జాతీయ జలాల్లోని పడవలపై అమెరికా దళాలు వైమానిక దాడులు నిర్వహించి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కనీసం 83 మందిని చంపారని విడుదల చేసిన డేటా లెక్కలు చూపిస్తున్నాయి.
ట్రినిడాడ్, టొబాగో ఐలాండ్ అమెరికా మెరైన్లు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇది ఒక నెలలో రెండవసారి. ఈ ఐలాండ్ వెనిజులా తీరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, వెనిజులాపై ఎటువంటి ఆపరేషన్ కోసం ట్రినిడాడ్, టొబాగో భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించదని ఆ దేశ ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేస్సార్ స్పష్టం చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ అలాంటి అనుమతి కోరలేదని కూడా ఆమె అన్నారు.
