మోడీ.. బతుకమ్మ శుభాకాంక్షలు

మోడీ.. బతుకమ్మ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆడపడుచులకు ప్రధాని నరేంద్ర మోడీ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ నారీ శక్తికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.  ఈ పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని మరింతగా పెంచి, పూల పట్ల ఆసక్తిని పెంపొందించుకుందాం” అని ట్వీట్ చేశారు.