నిరుద్యోగానికి మోదీ గ్యారంటీ ఇస్తారు:ప్రియాంక గాంధీ

నిరుద్యోగానికి మోదీ గ్యారంటీ ఇస్తారు:ప్రియాంక గాంధీ
  • బీజేపీపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు

న్యూఢిల్లీ: నిరుద్యోగానికి మోదీ గ్యారంటీ ఇస్తుంటాడని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 లక్షల ఖాళీలున్నాయని ఆమె మండిపడ్డారు. ‘ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ, గత 10 ఏండ్లలో వాటిని నింపడానికి  ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ సర్కారు హామీనిచ్చింది. 

అయితే, కొత్త ఉద్యోగాలను సృష్టించే మాట అటుంచి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో మోదీ ఇచ్చే గ్యారంటీలు ఉద్యోగాల కల్పనకు కాదు. ఆయన నిరుద్యోగానికి మాత్రమే గ్యారంటీ ఇస్తున్నారు” అని ప్రియాంక ఎద్దేవా చేశారు. 22 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే కేవలం 7 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారని జులై 2022లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిందని ప్రియాంక చెప్పారు.