హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ టాక్స్ ఎర్లీ బర్డ్ స్కీమ్ గురువారంతో ముగిసింది. ఈ పథకం ద్వారా మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం రూ.1,210 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.500 కోట్ల వసూళ్లతో సీఎంసీ టాప్నిలవగా, రూ.450 కోట్లతో జీహెచ్ఎంసీ, రూ.260 కోట్ల వసూళ్లతో ఎంఎంసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గడువు చివరి రోజు కావడంతో పన్ను చెల్లింపుదారులు భారీ సంఖ్యలో ఆసక్తి చూపడం వల్ల ఈ స్థాయిలో ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
