ఫిబ్రవరిలో 10 డ్రగ్స్ పార్టీలు: రాడిసన్ హోటలా.. డ్రగ్స్ పార్టీల అడ్డానా..!

ఫిబ్రవరిలో 10 డ్రగ్స్ పార్టీలు:  రాడిసన్ హోటలా.. డ్రగ్స్ పార్టీల అడ్డానా..!

హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలకు రాడిసన్ హోటల్ అడ్డానా.. అక్కడ డ్రగ్స్ పార్టీలు రెగ్యులర్ గా జరుగుతాయా.. పోలీసుల రిమాండ్ రిపోర్టులోని అంశాలతో.. అందరిలో ఇవే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ ద్వారా.. వివేకానందకు 10 సార్లు డ్రగ్స్ అందజేసినట్లు గుర్తించటం చూస్తుంటే.. డ్రగ్ పార్టీలు రోజు మార్చి రోజు జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది. రాడిసన్ హోటల్ లోని రూం నెంబర్ 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. హోటల్ యాజమాన్యంపై.. ఆపరేషన్స్ మేనేజర్ పై కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో నిందితుడు,డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

  • ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ కు, ప్రవీణ్ కు మీర్జా వాహిద్ బేగ్ డ్రగ్స్ ను అందజేశాడు.
  • స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ.. డ్రగ్స్ సప్లై, డెలివరీ  చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
  •  డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానందు కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు.
  • ఫిబ్రవరి నెలలోనే 10సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు గుర్తించారు
  • మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు.
  • ఈనెల 29న గచ్చిబౌలి ఐ ఎస్ బి దగ్గర నాలుగు కవర్లలో కొకైన్ ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
  • A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లరతో ఏడాదిగా మీర్జా వాహిద్ బేగ్ కు పరిచయం
  • స్నాప్ చాట్ ద్వారా పరిచయం చేసుకొని మీర్జా వాహిద్ బేగ్ డ్రగ్స్ దందా చేస్తున్నాడు 
  • కొకైన్ ను సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా మిర్జా వాహిద్ బేగ్ విక్రయిస్తున్నాడు.
  • రాడిసన్ హోటల్లో పదిసార్లు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
  • రెండు గ్రాములకు గూగుల్ పే ద్వారా రూ.30 వేలలు చెల్లించారు 
  • ఫిబ్రవరి 24న మధ్యాహ్నం కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరయ్యారు.
  • ఫిలిం నగర్, గచ్చిబౌలి ISB , జూబ్లీహిల్స్ లో మీర్జా వాహిద్ బేగ్.. కొకైన్ ను అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.