రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ అర్ధనగ్నంగా వాహనం నడుపుతూ భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని సస్పెండ్ చేశారు. అజ్మీర్, కోటా మధ్య ప్రయాణిస్తున్న ఈ బస్సులో రికార్డయిన ఈ క్లిప్, ప్రయాణీకుల భద్రత, రాష్ట్ర రవాణా శాఖ పర్యవేక్షణపై తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది.
గట్టిగ సౌండ్ ప్లే చేస్తూ, షర్ట్ లేకుండా డ్రైవర్: పరస్మల్ గా గుర్తించిన డ్రైవర్ తెల్లటి షార్ట్స్ మాత్రమే ధరించి బస్సు నడుపుతున్నట్లు రికార్డ్ అయినా వీడియోలో కనిపిస్తుంది. సమాచారం ప్రకారం, అతను ఎక్కువగా సరైన దుస్తులు లేకుండా వాహనం నడుపుతాడట. వీడియోలో దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాలో ఓ పాట ఫుల్ వాల్యూమ్‌లో ప్లే అవుతుండగా, అతను డ్రైవింగ్ చేస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, రాజస్థాన్ రోడ్‌వేస్ హెడ్ ఆఫీస్ వెంటనే యాక్షన్ తీసుకుంది.
సస్పెన్షన్ అండ్ విచారణకు ఆదేశం : అధికారులు త్వరగా చర్య తీసుకుని, పారస్మల్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో అతను బేసిక్ వేతనం మాత్రమే పొందుతాడు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అతని ప్రవర్తనను క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించి, ఇది ప్రయాణీకులను ప్రమాదంలో పడేస్తుందని అన్నారు. అజ్మీర్ డిపో చీఫ్ మేనేజర్ రవి శర్మ మాట్లాడుతూ పూర్తి దర్యాప్తు తర్వాత అతని కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
