పాక్పై భారత్ విజయాన్ని స్మరించుకుంటూ రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

పాక్పై భారత్ విజయాన్ని స్మరించుకుంటూ రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయ్ దివస్ సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళుల అర్పించారు. అప్పటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ..వారికి నివాళులు అర్పించారు.

 

అంతకుముందు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, భారత నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మాడే కూడా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

సరిగ్గా 50 ఏళ్ల  క్రితం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక వ్యవస్థ లొంగిపోయిన రోజుగా గుర్తించబడింది.   పాకిస్తాన్ సైన్యం నుండి 93వేల మంది సైనికులు తమ ఆయుధాలను భారత్ సమర్పించి  లొంగిపోయారు.  ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. 1971  డిసెంబర్ 16న  లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, తూర్పు పాకిస్తాన్ యొక్క చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ ,తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఈ లొంగుబాటు సాధనంపై సంతకం చేశారు.