"ఆదిపురుష్"లో ప్రభాస్ సింప్లీ సూపర్బ్ పిక్

"ఆదిపురుష్"లో ప్రభాస్ సింప్లీ సూపర్బ్ పిక్

యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ పోస్టర్ ను తాజాగా చిత్ర నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాముడి గెటప్ లో ఉన్న ప్రభాస్ పొడవాటి జుట్టు, రుద్రాక్షలు ధరించి ఆకాశంలోకి విల్లు ఎక్కుపెట్టిన ఓ సింప్లీ సూపర్బ్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లుక్ ను షేర్ చేసిన ప్రభాస్...... అక్టోబర్ 2న రాత్రి 7.11గంటలకు సరయు నది ఒడ్డున జరగనున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో అందరూ పాల్గొనండని రాసుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి అని పిలుపునిచ్చారు.

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ఈ సినిమా టీజ‌ర్‌ ను రామ జన్మభూమి అయోధ్యలో విడుద‌ల చేస్తామ‌ని మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాలో హీరో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతి సనన్ జానకీ దేవి పాత్రలో అలరించనున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్నన ఈ సినిమా... పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ మూనీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.