రోడ్డు కబ్జా చేస్తున్నారని ఆందోళన

రోడ్డు కబ్జా చేస్తున్నారని ఆందోళన

మేడ్చల్, వెలుగు: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ ప్రణామం గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ గేట్ రోడ్డును కబ్జా చేసేందుకు సాకేత్ బిల్డర్స్ ప్రయత్నిస్తున్నారని వృద్ధ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సాకేత్ ఈస్ట్ గేట్ ఎదుట ఆందోళన చేశారు. 

సాకేత్ ప్రణామం గేటెడ్​ కమ్యూనిటీలో నివాసముంటున్నామని, తమకు ఫ్లాట్లు విక్రయించే ముందు ఈస్ట్ గేట్ ను రోడ్డుగా లేఔట్ లో చూపించారన్నారు. అపార్ట్​మెంట్​లోని ఫ్లాట్లు పూర్తిగా అమ్ముడుపోయాక సాకేత్ బిల్డర్స్ ఈస్ట్ గేట్ రోడ్డును కబ్జా చేసేందుకు ప్రయత్తినస్తున్నారని 
వాపోయారు.