గల్ఫ్ ఆఫ్ ఒమన్లో మరో నౌకపై దాడి.. హార్మూజ్ జల సంధిలో టెన్షన్ టెన్షన్

గల్ఫ్ ఆఫ్ ఒమన్లో మరో నౌకపై దాడి.. హార్మూజ్ జల సంధిలో టెన్షన్ టెన్షన్

టెహ్రాన్​: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తాజాగా 6వ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.  ఖమేనీ మరణానికి ప్రతికారంగా ఇరాన్ ఈ కీలక జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్​జీసీ) ప్రకటించింది. ఈ హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు దిగింది. ఆదివారం 'స్కైలైట్' అనే పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌‌‌‌పై ఇరాన్ మిసైల్ దాడి చేసింది. 

ఓమన్ తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో ఓడ నుంచి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో 15 మంది భారతీయులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఓమన్ సహాయక చర్యలతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. 

సోమవారం నాడు యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎటీఓ) మరో రెండు నౌకలపై దాడులు జరిగినట్లు నివేదించింది. వీటిలో ఒకటి ఒమన్‌‌‌‌లోని మస్కట్ సమీపంలో, మరొకటి యూఏఈలోని మినా సఖర్ సమీపంలో దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయుడు ఒకరు చనిపోయినట్లు సమాచారం.