రోబో పనిమనిషి

రోబో పనిమనిషి

రాబోయే కాలంలో రోబోలు మనుషుల్ని రీ ప్లేస్‌ చేస్తాయని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లలో, బయట అక్కడక్కడ కొన్ని రోబోలను చూస్తున్నాం. అయితే ముందుముందు ఇంటి పనికి మనిషి అక్కర్లేదని అంటోంది యుకెలోని ‘డైసన్‌’ కంపెనీ.  వ్యాక్యూమ్‌ క్లీనర్‌‌, ఫ్లోర్‌‌ క్లీనర్‌, ఎయిర్‌‌ ప్యూరిఫయర్‌‌‌ ఇలా ఒక్కో పనికి ఒక్కో రోబో ఉంది. కానీ, ఇప్పుడు ఇంటి పనులన్నింటినీ చేసే రోబో తయారుచేస్తుందట ఆ కంపెనీ.

ఫిలడెల్ఫియాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ రోబోటిక్స్‌ అండ్‌ ఆటొమేషన్‌’ సదస్సులో ఈ విషయాన్ని చెప్పింది డైసన్‌ కంపెనీ. దీనికోసం మొత్తం 250 మంది రోబోటిక్‌ ఇంజనీర్లను వాళ్ల కంపెనీలో చేర్చుకున్నారట. ప్రస్తుతానికి ప్రోటో టైప్‌ రోబో అందుబాటులో ఉంది. ఆ వీడియోని కూడా మీటింగ్‌లో చూపించారు. ఆ వీడియోలో కింద పడ్డ బొమ్మను తీస్తూ, డైనింగ్‌ టేబుల్‌ సర్దుతూ, కిచెన్ పనుల్ని చేస్తూ కనిపించింది రోబో. 

‘ఇంట్లో పని మనిషి చేసే ప్రతి పనిని ఈ రోబో చేస్తుంది. అంట్లు తోమడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లల్ని ఆడించడం లాంటి ప్రతి పనీ చేస్తుంది. ఈ టెక్నాలజీని 2030‌‌ కల్లా ప్రజల ముందుకు తీసుకొస్తాం’ అని డైసన్ కంపెనీ చెప్తోంది.