RCB vs PBKS: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి ఓవర్లో గెలిచిన బెంగళూరు

RCB vs PBKS: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి ఓవర్లో గెలిచిన బెంగళూరు

ఐపీఎల్ లో బెంగళూరు బోణీ కొట్టింది. చెన్నై చేతిలో తొలి మ్యాచ్ లో ఓడినా..సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ ఔట్ కావడంతో పంజాబ్ ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 77,11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ కు తోడు చివర్లో లోమరోర్(8 బంతుల్లో 17), దినేష్ కార్తీక్(10 బంతుల్లో 28) మెరుపులతో ఆర్సీబీ ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.      

177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఆర్సీబీ డుప్లెసిస్(3) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గ్రీన్(3), పటిదార్(18), మ్యాక్స్ వెల్(3), అనుజ్ రావత్(11) లలో విఫలం కావడంతో ఆర్సీబీ ఛేజింగ్ లో వెనకపడింది. ఓ వైపు కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నా.. మరో వైపు అతనికి సహకరించే వారు కరువయ్యారు. 16 ఓవర్ చివరి బంతికి కోహ్లీ ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అయితే చివర్లో లోమరోర్, దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.   

Alao Read : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కెన్యా దిగ్గజం

అంతకముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ సమిష్టిగా రాణించింది. వచ్చిన వారు వచ్చినట్టు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సామ్ కరణ్(23) జితేష్ శర్మ (27), సిమ్రాన్ సింగ్(25), శశాంక్ సింగ్ (21) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. యాష్ దయాళ్ అల్జారీ జోసెఫ్ కు చెరో వికెట్ దక్కింది.