అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కెన్యా దిగ్గజం

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కెన్యా దిగ్గజం

ఒక క్రికెటర్ దశాబ్ద కాలం ఆడితేనే అతన్ని గ్రేట్ ప్లేయర్ అంటాం. ఇక రెండు దశాబ్దాలడితే దిగ్గజాలతో పోలుస్తాం. 20 ఏళ్ళ క్రికెట్ కెరీర్ ఆడిన ప్లేయర్లను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. ఆ లిస్టులోకి టాప్ జట్లలోని స్టార్ ఆటగాళ్లు ఉన్నారనే సంగతి మాత్రమే మనకి తెలుసు. కానీ ఒక అసోసియేట్ క్రికెటర్ 23 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగడంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. అతనెవరో కాదు  కెన్యాకు చెందిన కొలిన్స్ ఒబుయా.

కెన్యా క్రికెట్ లో ప్రతిభ గల ఆటగాళ్లలో ఒబుయా ఒకడని ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. 23 ఏళ్లుగా జట్టుతో కొనసాగినా ఈ ఆల్ రౌండర్  అంత‌ర్జాతీయ కెరీర్‌కు ఆదివారం (మార్చి 24) రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అక‌ర్రాలో జ‌రిగిన ఆఫ్రికా గేమ్స్ త‌ర్వాత క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు వెల్ల‌డించాడు. తన చివరి మ్యాచ్ లో డ‌కౌట్‌గా వెనుదిరిగిన అతన్ని‘గార్డ్ ఆఫ్ హాన‌ర్‌’తో గౌర‌వించారు.కెన్యా త‌ర‌ఫున ఆడ‌డం గొప్ప గౌర‌వం. నా కెరీర్‌లోని మంచి, క‌ష్ట స‌మ‌యాల్లో అండ‌గా నిలిచిన జ‌ట్టు స‌భ్యులు, నా కుటుంబానికి ధ‌న్య‌వాదాలు. ఇన్నేండ్లు క్రికెట్ ఆడ‌డం నిజంగా అదృష్టం’ అని ఒబుయా తెలిపాడు.

Also Read : ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్.. 32 ఏళ్లలో తొలిసారి

2003 కెన్యా జట్టు వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరి సంచలనం సృష్టిచిన జట్టులో ఒబుయా సభ్యుడు. భారత్ పై ఈ మ్యాచ్ లో ఓడిపోనుంది. అసోసియేటెడ్ దేశాల‌కు చెందిన ఓ అనామ‌క జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ సిక్స్ ద‌శ దాటి సెమీస్ కు చేరడం ఆ దేశ క్రికెట్ లో అత్యుత్తమ క్షణాలు. ఒబుయా 104 వ‌న్డేల్లో 2,044 ర‌న్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 35 వికెట్లు పడగొట్టాడు.