రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. ధరను రూ.2.79 లక్షలుగా నిర్ణయించింది. బ్యాటరీని అద్దెకు తీసుకునే పద్ధతిలో అయితే రూ.రెండు లక్షలకే లభిస్తుంది. డెలివరీలు వచ్చే నెల చివరలో మొదలవుతాయి. ఇందులోని 3.91 కిలోవాట్ల బ్యాటరీని చార్జ్‌చేస్తే154 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫ్లయింగ్ ఫ్లీ సీ6లో గిర్డర్ సస్పెన్షన్ ఫోర్క్స్, టచ్ స్క్రీన్ కన్సోల్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' (Flying Flea C6) అధికారికంగా విడుదలయ్యింది. క్లాసిక్ రెట్రో లుక్ ,అత్యాధునిక ఈవీ టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.79 లక్షలు. అయితే బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) పద్ధతిలో బ్యాటరీని అద్దెకు తీసుకుంటే కేవలం రూ. 1.99 లక్షలకే లభిస్తుంది. ఏప్రిల్ 10 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, మే 2026 చివరి నుంచి డెలివరీలు మొదలవుతాయి.
ఇందులో 3.91 కిలోవాట్ల (kWh) లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ.100 శాతం ఛార్జ్ కావడానికి కేవలం 2 గంటల 16 నిమిషాలు పడుతుంది.
లేటెస్ట్ ఫీచర్లు..
రెట్రో టెక్: క్లాసిక్ లుక్ ఇచ్చే గిర్డర్ సస్పెన్షన్ ఫోర్క్స్
డిజిటల్ కన్సోల్: 3.5-అంగుళాల రౌండ్ టచ్ స్క్రీన్ TFT డిస్‌ప్లే (బ్లూటూత్, నావిగేషన్ సపోర్ట్‌తో).
సేఫ్టీ: కార్నరింగ్ ఏబీఎస్ (Cornering ABS), ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐదు రైడింగ్ మోడ్స్.
బరువు: కేవలం 124 కేజీల బరువుతో, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలోనే అత్యంత తేలికైనది.
