కాచిగూడలో రూ.25 లక్షల బెట్టింగ్

కాచిగూడలో రూ.25 లక్షల బెట్టింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: కాచిగూడలోని ఓ అపార్ట్‌‌మెంట్ ​కేంద్రంగా ఆన్​లైన్ ​గేమింగ్​యాప్స్ ద్వారా క్రికెట్ ​బెట్టింగ్​నిర్వహిస్తున్న ముగ్గురిని వెస్ట్​జోన్​ టాస్క్​ఫోర్స్ ​పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.25లక్షల క్యాష్‌‌, ల్యాప్‌‌టాప్‌‌,11ల్యాండ్‌‌ లైన్ ఫోన్స్‌‌,11 సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌‌ జోన్‌‌ అడిషనల్‌‌ డీసీపీ శ్రీనివాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్​కి చెందిన నీరజ్ జైన్(45) బట్టల వ్యాపారి. రాజేంద్రనగర్‌‌ ఏరియాలో బెట్టింగ్‌‌ నిర్వహిస్తూ రెండు సార్లు పోలీసులకు చిక్కాడు. కాచిగూడ చప్పల్‌‌ బజార్‌‌‌‌కి చెందిన అమిత్‌‌ సర్ధ(41) క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ కేసుల్లో నిందితుడు. వీరిద్దరూ పురానాపూల్​లోని కబూతర్​ఖానాకు చెందిన నారాయణ్‌‌దాస్‌‌(37)తో కలిసి కాచిగూడలోని ఓ అపార్ట్‌‌మెంట్​లో ఉంటూ ఐపీఎల్​ మ్యాచ్​లపై క్రికెట్ ​బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన విమెన్‌‌ టీ–20 మ్యాచ్‌‌పై బెట్టింగ్‌‌ నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న వెస్ట్‌‌జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు కాచిగూడ పోలీసులతో కలిసి దాడులు​చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు 
తరలించారు.