యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో జిందా బందా సాంగ్.. షారుక్ జవాన్ మూవీ రికార్డ్

యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో జిందా బందా సాంగ్.. షారుక్ జవాన్ మూవీ రికార్డ్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah rukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్(Red chillies) పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్(Gowry khan) నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన జిందా బందా సాంగ్ రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయినా 24 గంటల్లోనే 46+ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సాంగ్ 24 గంటల్లో బాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించినా హిందీ సాంగ్ గా నిలిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో దుమ్ము దులిపేలా అంటూ చంద్రబోస్ ఈ సాంగ్ ను రచించగా..మంగ్లీ, అనిరుధ్ పాడారు.  షారుఖ్,ప్రియమణి దుమ్ము లేపేలా డ్యాన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండ్ అవుతోంది.   

రీసెంట్ గా పఠాన్(Patan) సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుక్ నుండి వస్తున్న మూవీ కావడంతో.. జవాన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. షారుక్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.