చాలా మంది ఉప్పు ఆరోగ్యానికి పెద్ద శత్రువుల, ఉప్పు తింటే మంచిది కాదని, తినడం తాగించాలి అని చెప్తుంటారు. కానీ, కార్డియాలజిస్ట్ డాక్టర్ల ప్రకారం... అవన్నీ ఉప్పు మీద ఉన్న కేవలం ఒక ప్రచారం మాత్రమే, అసలు నిజం మాత్రం వేరే అంటున్నారు.
ఉప్పు అందరికీ చెడు చేస్తుందా అని అడిగితే డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం, ఉప్పు మానవత్వానికి శత్రువు కాదు. మన శరీరానికి సోడియం అంటే ఉప్పు చాలా అవసరం. నరాలు పనిచేయాలన్నా, కండరాలు కదలాలన్నా, శరీరంలో నీటి నిల్వలు సరిగ్గా ఉండాలన్నా ఉప్పు కావాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవారికి ఉప్పు వల్ల ఎం ప్రమాదం ఉండదు. కానీ, ఆరోగ్యం బాలేని వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఉప్పు ఎవరికి ప్రమాదం అంటే :
ఉప్పు అందరి మీద ఒకే ప్రభావం చూపదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండె బలహీనంగా ఉన్నవారు ఉప్పు ఎక్కువ తీసుకుంటే శరీరంలో నీరు చేరిపోతుంది. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, అనారోగ్యానికి గురికావడం వంటి పరిస్థితి వస్తుంది. బీపీ తగ్గని వారు మూడు నాలుగు రకాల మందులు వేసుకున్నా బిపి కంట్రోల్ కాకపోతే, దానికి కారణం ఉప్పు కావచ్చు. అప్పుడు ఉప్పును బాగా తగ్గించాలి.
►ALSO READ | Good Health: చలికాలంలో ఇవి పాటించండి... ఎక్కువ కాలం జీవిస్తారు..!
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఉప్పు విషం లాంటిది. ఎందుకంటే ఉప్పు కిడ్నీలను త్వరగా దెబ్బతీస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారికి కూడా ఉప్పు వల్ల కడుపులో, కాళ్లలో నీరు చేరుతుంది. వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాలు గట్టిపడతాయి. అప్పుడు ఉప్పు తింటే బీపీ అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది.
డాక్టర్ చెప్పే విషయం ఏంటంటే జిమ్‌కు వెళ్లే వాళ్ళు లేదా ఆరోగ్యంగా ఉన్నవారు ఉప్పుకు భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఉప్పును విషంలా చూడకూడదు. ఎవరు ఎంత మోతాదులో ఉప్పు తినాలి అనేది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది అని డాక్టర్లు అంటున్నారు.
