పోర్న్ ఎక్కువగా చూడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ 

పోర్న్ ఎక్కువగా చూడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ 


కరోనా పుణ్యమా వెబ్ ప్రపంచం అనూహ్య వేగంతో విస్తరించింది. ముఖ్యంగా మన దేశంలో మొబైల్ ఫోన్ల వంటి గాడ్జెట్లు ఇంటర్నెట్ ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. ఫ్రీ డేటా.. లాక్ డౌన్ పుణ్యమా అని ఖాళీ సమయం యువతకు పోర్న్ కంటెంట్‌ను యాక్సెస్ చేసే అవకాశం కావాల్సినంత కల్పించింది. ఇది మన ప్రవర్తనను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.  పోర్న్ కంటెంట్‌ను చూడడం క్రమేపీ వ్యసనంగా మారి కొత్త సమస్యలు సృష్టిస్తోంది. 
పలు అధ్యయనాల ప్రకారం, పోర్న్ చూసే పురుషులు తమ లైంగిక జీవితంలో ఎక్కువ అసంతృప్తితో ఉంటారని.. అదే ఒకపట్టాన సంతృప్తి చెందనీయకుండా చేస్తున్నట్లు తేలింది.  పోర్న్ కంటెంట్‌ చూడడం అనే అలవాటు చాలా వరకు ఆల్కహాల్ వినియోగంతో పోల్చిచూడొచ్చు. ఇది అందరికీ చెడ్డది కాదు, కానీ కొన్ని ప్రమాద కారకాలకు దారితీస్తోంది. అశ్లీలతపై పూర్తిగా ఆధారపడే వ్యక్తులను అత్యాచారం లేదా లైంగిక హింస వంటి నేరాలకు ప్రేరేపిస్తుంది. లైంగిక హింస, దూకుడు స్వభావాన్ని పెంపొందిస్తుంది. 
ఒక నివేదిక ప్రకారం, అశ్లీల చిత్రాలకు బానిసలైన వ్యక్తులెవరంటే తమ జీవితంలో ఆర్థిక, ఉపాధి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నవారేనని తేలింది. పోర్న్ కంటెంట్ మనిషి శరీరంలో డోపామైన్ విడుదలను ప్రాక్టికల్ కాని రీతిలో ప్రేరేపిస్తుంది, ఇది ఒక వ్యక్తిని నిరాశావాదిగా చేస్తున్నట్లు గుర్తించారు.
శృంగార కంటెంట్, అశ్లీల ఆలోచనలు మరియు లైంగిక జీవితంలో అవాస్తవ అంచనాలను ప్రోత్సహిస్తుంది. ఇది మహిళల పట్ల పురుషుల వైఖరిని మరింత ప్రతికూలంగా మరియు మూసపోతగా చేస్తుంది. అశ్లీలత ఒక ‘ఓపెన్ మైండెడ్ బిహేవియర్’ను ప్రోత్సహిస్తుంది, ఇది అసంతృప్తి చెందిన వ్యక్తిని సెక్స్ కోసం ఎక్కువ భాగస్వాములను కోరడానికి లేదా ఎఫైర్ కలిగి ఉండటానికి బలవంతం చేస్తుంది.

అధ్యయనాల ప్రకారం నిపుణుల సలహా ఏమిటంటే..
మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి నిపుణులు పోర్న్ చూడటానికి గడిపే సమయాన్ని తగ్గించమని ప్రజలకు సలహా ఇస్తున్నారు. సెక్స్ లేదా సాన్నిహిత్యం గురించి మీ అవగాహన పెంచుకోవడానికి పోర్న్ కంటెంట్ సరైన మార్గం కాదని గుర్తుంచుకోమంటున్నారు.
అశ్లీలత కారణంగా చాలా మంది ఇప్పటికే చాలా అశాంతిగా ఉంటున్నారు. అశ్లీల వ్యసనాలతో పోరాడుతున్న వ్యక్తులు కావాలనుకుంటే సోషల్ మీడియాలో స్నేహితులతో తిరిగి కనెక్ట్ కావచ్చు. మీ ఆరోగ్యానికి ఏది ముఖ్యమైనది మరియు ఏది కాదు అనే తేడాను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు.