V6 News

ఓటరు మ్యాపింగ్లో జాప్యమేంది?.. మల్కాజిగిరి ఆఫీసర్ల తీరుపై అదనపు సీఈఓఅసహనం

ఓటరు మ్యాపింగ్లో జాప్యమేంది?.. మల్కాజిగిరి ఆఫీసర్ల తీరుపై అదనపు సీఈఓఅసహనం

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగడంపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్​రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మల్కాజిగిరి జోనల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటింటినీ సందర్శించాలని ఆదేశించారు.

2025 ఓటర్ల జాబితా కోసం 2002 రికార్డులను ప్రామాణికంగా తీసుకుని తప్పుల్లేని జాబితా రూపొందించాలని సూచించారు. రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఈ నెలాఖరుకల్లా మ్యాపింగ్ పూర్తి చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 మే 5 గడువు: ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రోగ్రాం పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బీఎల్‌‌‌‌‌‌‌‌ఓ రోజుకు 100 మందిని, సూపర్​వైజర్ 1000 మంది ఓటర్లను మ్యాప్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రక్రియను మే 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఈఆర్​ఓలు, ఏఈఆర్​ఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రకళ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.