- పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి ఓటర్ల నమోదు ముసయిదా ప్రకటించి మార్పులకు నవంబర్ 30 వరకు టైం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో బుత్ లెవేల్ ఆపీసర్ ఈనెల 6, 7 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఫాం 6 ప్రకారం మార్పులు చేర్పులు చేయాలి.. కానీ మన రాష్ట్రంలో అది ఆమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అధికారులు సక్రమంగా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లు గల్లంతు ఆయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేయొద్దు అని కోరారు.

