సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది.కారు షెడ్డులో మంటలు చెలరేగడంతో రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. మంగళవారం ( ఏప్రిల్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని కారు మెకానిక్ షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షెడ్డులో ఉన్న రెండు కార్లు పూర్తిగా తగలబడ్డాయి. మంటలు చూసి బయటికి పరుగులు తీశామని చెబుతున్నారు మెకానిక్ లు. ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

