- 84 ట్రాఫిక్ సూపర్ వైజర్, 114 మెకానికల్
- సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు
- ఈ నెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు
- ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో 198 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాఫిక్ సూపర్ వైజర్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆ పోస్టులకు నెల జీతం రూ.27 వేల 80 నుంచి రూ.81 వేల 400 వరకు నిర్ణయించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఈ నెల 30 ఉదయం
8 గంటల నుంచి 2026 జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులకు ఇచ్చిన సూచనలతో పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
