
రెక్కాడితేనే డొక్కాడే రైతులకు, రోజూవారీ కూలీలకు, రోడ్డు పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికే శ్రమజీవులకు ఎండా, వానతో పనేముంది ? ఏ రోజుకారోజు పనిచేసుకుంటేనే కుటుంబం గడుస్తుందాయే ! అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా తమ పనుల్లో నిమగ్నం అవుతుంటారు.
ప్రస్తుతం వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల్లోనూ రాష్ట్రమంతా ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి. వానలో తడుస్తూ నాట్లు వేసే వారు కొందరైతే.. ఫుత్‌పాత్‌ల వద్ద గొడుగు నీడలో పండ్లు, కూరగాయలు అమ్మేవారు ఇంకొందరు.. తోపుడు బండ్లపై తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వారు మరికొందరు.. ఇలా జోరువానలో ఆగని బతుకుపోరుకు దృశ్యమాలికే ఇది.. - వెలుగు ఫొటోగ్రాఫర్స్, నెట్‌వర్క్