సమ్మర్ లో చెరుకు రసం..

సమ్మర్ లో చెరుకు రసం..

సమ్మర్‌‌లో శరీరం తొంద‌ర‌గా డీ హైడ్రేట్​​ అవుతుంది. ఇలాంటప్పుడు శరీరానికి కావాల్సిన నీటిని అందించడానికి చెరుకు రసం బెస్ట్​ ఆప్షన్​. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. అలాగే చెరుకు రసంలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరెన్, జింక్‌తో పాటు చాలా రకాల అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్, ప్రొటీన్ కూడా పుష్కలం. వీటన్నింటితో  పాటు ఆరోగ్యానికి  మేలు చేసే మరెన్నో గుణాలున్నాయి చెరుకు రసానికి. అవేంటంటే.... 

  • చెరుకు రసంలో  సుక్రోజ్ ఉంటుంది. ఇది బాడీకి ఇన్​స్టంట్​ ఎనర్జీ ఇస్తుంది. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నా, నీటి శాతం తక్కువ అనిపించినా చెరుకు ర‌‌సం తాగితే మంచిది. మెటబాలిజం పనితీరు బాగుంటుంది. దాంతో క్యాలరీ  కరిగి తేలిగ్గా బరువు తగ్గొచ్చు.
  • చెరుకు రసాన్ని కామెర్ల ట్రీట్మెంట్​లోనూ ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇది కాలేయంలో ప్రొడ్యూస్‌‌ అయ్యే బిలిరుబిన్ లెవల్స్‌‌ను తగ్గిస్తుంది. దాంతో కామెర్లు త్వరగా తగ్గుతాయి. 
  • చెరుకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరెన్‌‌, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్​ కణాలతో ఈ రసంలోని అల్కలీన్​ పోరాడుతుంది.
  • చెరుకు రసం వల్ల యూరినరీ ట్రాక్​ ఇన్ఫెక్షన్స్‌‌ కంట్రోల్​ అవుతాయి. యూరిన్‌‌ వెళ్లేటప్పుడు మంటగా అనిపిస్తే చెరుకు రసం తాగితే రిలీఫ్​ వస్తుంది. అంతేకాకుండా చెరుకు రసం కిడ్నీలను శుభ్రపరిచి, రాళ్లు చేరకుండా చూస్తుంది. 
  • ఈ జ్యూస్​లో  క్యాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి పళ్లపై ఉండే ఎనామిల్‌‌ దెబ్బతినకుండా చూస్తాయి.  నోటి  దుర్వాసనను పోగొడతాయి. వీటిల్లోని పొటాషియం కడుపులోని పీహెచ్ లెవల్స్‌‌ను బ్యాలెన్స్‌‌ చేస్తుంది. చెరుకు రసంతో జీర్ణ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు.