83 ఏళ్ల యువ యోధుడు ఎన్సీపీకి మార్గదర్శకత్వం చేయనున్నారు.. : సుప్రియా సూలే

83 ఏళ్ల యువ యోధుడు ఎన్సీపీకి మార్గదర్శకత్వం చేయనున్నారు.. : సుప్రియా సూలే

ఈరోజు శరద్ పవార్ పిలిచిన సమావేశానికి పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తలు హాజరుకావాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కోరారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం కూడా ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ప్రకటించడంతో ఈ మీటింగ్ కు ఎంతో ప్రాముఖ్యత చోటుచేసుకుంది. మెజారిటీ ఎన్సీపీ శాసనసభ్యుల మద్దతు తమకు ఉందని ఇరువర్గాలు పేర్కొంటున్న సమయంలో.. ఈరోజు జరిగే సమావేశాలు వాస్తవంగా ఎవరికి సంఖ్యాబలం ఉన్నాయనే విషయంపై స్పష్టత రానుంది.

"ఈ సమావేశానికి మీరందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వినయపూర్వకమైన అభ్యర్థిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో 83 ఏళ్ల యువ యోధుడు అంటే మన గౌరవనీయులైన పవార్ సాహెబ్ రేపు ఆఫీసు బేరర్లు, కార్మికులందరికీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకత్వం వహించబోతున్నారు " అని సులే ఒక వీడియోలో పేర్కొన్నారు.  ఈ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 1గంటలకు జరగనుంది.

 

महाराष्ट्राच्या स्वाभिमानी जनतेने आदरणीय पवार साहेबांवर (@PawarSpeaks) नेहमीच जीवापाड प्रेम केलं आहे. आणि साहेबांचा देखील इथल्या जनतेवर जीव आहे. हे नातं अतूट आणि पहाडासारखं भक्कम आहे. प्राप्त परिस्थितीत आपल्या सर्वांच्या राष्ट्रवादी काँग्रेस पक्षाला (@NCPspeaks) पुढील दिशा… pic.twitter.com/cqOawLAaZi

— Supriya Sule (@supriya_sule) July 4, 2023
 
 

 

శరద్ పవార్‌కు తెలియకుండా అత్యంత గోప్యంగా అజిత్‌ తిరుగుబాటు చేయడం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ సమయంలో శరద్ పవార్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాజకీయాల పరంగా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామానికి తాను బాధపడటం లేదని, పార్టీ గతంలోనూ ఎన్నోసార్లు ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందని, కిందపడిన ప్రతిసారి తిరిగి పుంజుకుందని, ఇప్పుడు కూడా పార్టీ పునర్నిర్మాణానికి శక్తియుక్తులు ధారపోస్తానని శరద్ పవార్ ప్రకటించారు.

https://twitter.com/supriya_sule/status/1676211449046384640