బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి

బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా  దండానికి కరెంట్ షాక్ రావడంతో    మన్నెమ్మ( 45). భాను ప్రసాద్( 19) ఇద్దరు మృతి చెందారు.

మణెమ్మ ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా   దండానికి విద్యుత్ షాక్ తగిలి   విలవిలలాడింది. అక్కడే ఉన్న భాను ప్రసాద్ పెద్దమ్మకు షాక్ వచ్చిందని వెంటనే వెళ్లి  వైర్లను తొలగిస్తుండగా  విద్యుత్ షాక్ తగలడంతో  అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు