ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాజకీయంలో మాత్రం హీట్ ఇంకా తగ్గలేదు. కొన్ని చోట్ల అల్లరు.. మరి కొన్ని చోట్ల దాడులతో రాష్ట్ర అట్టుడుకుతుంది. ఈ క్రమంలోనే మరో అనుహ్య పరిణామం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఇటీవల వైసీపీ నుంచి జంగా కృష్ణ మూర్తి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తిపై వైసీపీ నేతలు మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ పలుమార్లు విచారించారు.జంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు మండలి చైర్మన్. జంగా కృష్ణమూర్తి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఆయన 1999, 2009 ఎన్నికల్లో గురజాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత ఆయన 2014లో వైఎస్సార్‌సీపీలో చేరి గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన టికెట్ దక్కకపోవడంతో నిరశకు గురయ్యారు. దీంతో సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. 2024లో సైతం టికెట్ ఆశించి బంగపడ్డారు జంగా కృష్ణమూర్తి. ఎన్నికలకు ముందు టీడీపీ చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ మార్పుపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు చైర్మన్ పలు మార్లు విచారించి అనర్హత వేటు వేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారు.