న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య నాలుగు శాతం పెరిగి 5.77 లక్షలకు చేరిందని రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ అనరాక్ తెలిపింది. డిమాండ్ కన్నా సరఫరా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 2024 చివరి నాటికి 5.53 లక్షలుగా ఉన్న అమ్ముడుపోని ఇళ్లు 2025 నాటికి 5.76 లక్షలకు పెరిగాయి. ప్రధానంగా ఢిల్లీ– ఎన్‍సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, పుణె నగరాల్లో ఈ సంఖ్య పెరిగింది. బెంగళూరులో అత్యధికంగా 23 శాతం వృద్ధి నమోదైంది. ముంబై, హైదరాబాద్ నగరాల్లో మాత్రం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో ఈ సంఖ్య రెండు శాతం తగ్గి 96,140 యూనిట్లుగా ఉందని అనరాక్ తెలిపింది.
