పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

పోలీస్ స్టేషన్ లోనే తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీశైలం పోలీస్టేషన్ లో  కానిస్టేబుల్ శివశకంర్  రెడ్డి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  తెల్లవారుజామున రెస్ట్ రూములో  గన్ తో  తలపై కాల్చుకున్నాడు.  కర్నూలుకు చెందిన   శివశంకర్ రెడ్డి (46)  శ్రీశైలం పోలీస్టేషన్ లొ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.   సమాచారం అందుకున్న సీఐ ప్రసాదరావు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.