Viral Video: వావ్ .. ఈ గాజులమ్మ ఇంగ్లీషు అదరగొట్టింది

 Viral Video: వావ్ .. ఈ గాజులమ్మ ఇంగ్లీషు అదరగొట్టింది

ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలని ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడితే ఏ పొరపాట్లు జరుగుతాయో అని, ఇతరులు ఎగతాళి చెస్తారేమోనే భయంతో ఉంటాం.కాని గాజులు, ముత్యాలు అమ్మే మహిళ ఇంగ్లీషులో అదరగొట్టింది. ఆమె ఇంగ్లీషులో గోవా గురించి చక్కగా వివరించింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. 

వివరాల్లోకి వెళ్తే...

నేటి కాలంలో ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత పెరిగింది. భాష నైపుణ్యాలలో ఇంగ్లీష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడమంటే చాలా కష్టం.. దానికి మొదటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు ఉండాలి.. లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకుని ఉంటే.. ఇంగ్లీష్ మాట్లాడలేము. డిగ్రీ, పీజీలు చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడేందుకు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ.. ఒక గాజులు అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే.. ఆశ్చర్యపోతారు. ఈ మహిళ గోవాలో గాజులు, ముత్యాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ మహిళ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌ అవుతుండగా.. ఆమె గోవా గురించి ఇంగ్లీష్‌లో అనర్గళంగా చెబుతోంది. ఈమె మాట్లాడే ఇంగ్లీషు మాటలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో ఇన్స్టాలో der_alpha_mannchenలో ఖాతాతో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ ఇసుకపై కూర్చుని ఇంగ్లీషులో మాట్లాడుతోంది. కోవిడ్ తర్వాత గోవా బీచ్‌లలో ఎలాంటి మార్పులు జరిగాయో ఆమె స్పష్టమైన ఆంగ్లంలో వివరించింది. ఆమె ఎంతకాలం నుంచి అక్కడ ఉందో.. అక్కడ ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పింది. ఆ మహిళ ఏ మాత్రం తడబడకుండా ఆంగ్లంలో సమాధానం చెబుతోంది. ఆమె మాట్లాడే విధానం కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు ( వార్త రాసే సమయం వరకు)  కోటి మందికి పైగా వీక్షించారు. 14 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు  స్పందించారు.ఆ స్త్రీని చూస్తుంటే నా చదువుపై అనుమానం వస్తుంది అని ఒకరు అన్నారు. ఆమె ఇంగ్లీషు ఒక భాష మాత్రమే.. జ్ఞానం కాదు అని స్త్రీ నిరూపించిందని మరో సోషల్ మీడియా యూజర్ రాశారు.  ఇంకొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ఆమె మా ఇంగ్లీషు టీచర్ కంటే బాగా ఇంగ్లీషు మాట్లాడుతుంది  .. ఆమె భాష, ఉచ్చారణ చాలా బాగున్నాయి. ఆమె చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల కంటే మెరుగ్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది... అని తెలిపారు.