
హైదరాబాద్, వెలుగు: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంచే ప్రసక్తి లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 2,620 మద్యం షాపులకు గాను ఈ నెల18న దరఖాస్తులకు గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం ఒక్క రోజే 4,300 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల గడువు పెంచు తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
ఈ నెల 21, 22న డ్రా కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు పేర్కొన్నారు. 23న కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపుల డ్రా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. 2023లో మద్యం షాపులకు దరఖాస్తులు పిలిస్తే చివరి రెండ్రోజులు 75 శాతం వచ్చాయి. ఈ సారి కూడ దరఖాస్తులు చివరి రెండు, మూడు రోజుల్లో వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.